ప్రయాణం మొదలైంది

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:45 AM

సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్‌ తన కొత్త సినిమా వివరాలు వెల్లడించారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపుదిద్దుకొనే ఈ సినిమాకు ‘డీజీఎల్‌’ అని పేరు పెట్టారు...

సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్‌ తన కొత్త సినిమా వివరాలు వెల్లడించారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపుదిద్దుకొనే ఈ సినిమాకు ‘డీజీఎల్‌’ అని పేరు పెట్టారు. గంటా కార్తీక్‌ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. ఈ సందర్భంగా రెండు పోస్టర్లు విడుదల చేశారు. కాజీపేట జంక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై హీరో నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్స్‌ పై రైళ్లు వెళుతున్నాయి. ఆ పోస్టర్‌లో ‘జర్నీ బిగిన్స్‌’ అని రాసుంది. నవంబర్‌లో షూటింగ్‌ మొదలవుతుందనీ, నటీనటులు, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు జ్ఞానశేఖర్‌ వీఎస్‌ ఛాయాగ్రాహకుడు.

Updated Date - Sep 16 , 2024 | 05:45 AM