గాయం ఇబ్బంది పెడుతోంది

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:16 AM

టాలీవుడ్‌ హీరోయిన్‌ చాందిని చౌదరి కొన్ని రోజులుగా గాయంతో బాధపడుతున్నారు. దాంతో కొన్నాళ్లు షూటింగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చాందిని స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు...

టాలీవుడ్‌ హీరోయిన్‌ చాందిని చౌదరి కొన్ని రోజులుగా గాయంతో బాధపడుతున్నారు. దాంతో కొన్నాళ్లు షూటింగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చాందిని స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ‘కొన్నాళ్ల కిత్రం నాకు ఓ గాయమైంది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టింది. షూట్‌ కోసం వెళ్తుంటే మరింత నొప్పిగా అనిపిస్తోంది. దీంతో అన్నింటికీ కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని ఆ పోస్టులో చాందిని పేర్కొన్నారు. ‘కలర్‌ ఫొటో’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని... గామి, మ్యూజిక్‌ షాప్‌ మూర్తి, యేవమ్‌ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త సినిమాలో నటిస్తున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 03:16 AM