ఆ ఇల్లు అమ్మక తప్పలేదు

ABN, Publish Date - Sep 18 , 2024 | 04:49 AM

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనేది ఒకప్పటి సామెత. దానికి పొడిగింపుగా ‘సినిమా తీసి చూడు’ అని చేర్చుకోవాల్సి వస్తోంది ఇప్పుడు. ఇందుకు తాజా ఉదాహరణ బాలీవుడ్‌ నటి. దర్శకురాలు కంగనా రనౌత్‌. ఆమెకు ముంబైలో...

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనేది ఒకప్పటి సామెత. దానికి పొడిగింపుగా ‘సినిమా తీసి చూడు’ అని చేర్చుకోవాల్సి వస్తోంది ఇప్పుడు. ఇందుకు తాజా ఉదాహరణ బాలీవుడ్‌ నటి. దర్శకురాలు కంగనా రనౌత్‌. ఆమెకు ముంబైలో బాంద్రా ప్రాంతంలోని పాలీ హిల్‌ లో ఓ ఖరీదైన బంగ్లా ఉంది. 2017లో రూ. 20 కోట్లకు దీన్ని కొన్నారు కంగనా. నిబంధనలకు విరుద్ధంగా ఉందని 2020లో ఈ బంగ్లాలోని కొంత భాగాన్ని బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చివేయడంతో అప్పట్లో కంగనా అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే బంగ్లాను అమ్మేశారు కంగనా. కారణం.. ఆమె దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఎమర్జెన్సీ’ సినిమా. జీ స్టూడియోస్‌తో కలసి ఆమె నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కావాలి. కానీ సెన్సార్‌ సర్టిఫెకెట్‌ రాని కారణంగా విడుదల వాయిదా పడింది.


ఇప్పటికే ఆ సినిమా మీద చాలా డబ్బు పెట్టిన కంగనా మిగిలిన ఖర్చుల కోసం బంగ్లాను కూడా అమ్మేశారు. ‘నా దృష్టిలో ఆస్తులు అనేవి అవసరం వచ్చినప్పుడు ఆదుకొనేవే. అందుకే బంగ్లా అమ్మేశాను’ అని చెప్పారు కంగనా. రూ. 32 కోట్లకు అమ్మకం జరిగిందని సమాచారం.

Updated Date - Sep 18 , 2024 | 04:49 AM