కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’

ABN, Publish Date - Jan 01 , 2024 | 04:52 AM

కోలీవుడ్‌ హీరో విజయ్‌ నటిస్తున్న 68వ చిత్రం టైటిల్‌ను నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ ఆదివారం ప్రకటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనే...

కోలీవుడ్‌ హీరో విజయ్‌ నటిస్తున్న 68వ చిత్రం టైటిల్‌ను నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ ఆదివారం ప్రకటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌పై ‘వెలుతురు చీకటిని మింగేయగలదు.. కానీ, చీకటి వెలుతురును మింగలేదు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, రాఘవ లారెన్స్‌, ప్రశాంత్‌, మైక్‌ మోహన్‌, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 04:52 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!