ఆఖరి అధ్యాయం మొదలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 06:38 AM

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ పోరాట యోధుడిగా నటిస్తున్న హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏ.ఎమ్‌ రత్నం సమర్పణలో...

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ పోరాట యోధుడిగా నటిస్తున్న హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏ.ఎమ్‌ రత్నం సమర్పణలో ఏ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. విజయవాడలో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా సెట్స్‌లోకి పవన్‌ కల్యాణ్‌ అడుగుపెట్టినట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అని పేర్కొంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌పై కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, బాబీ డియోల్‌, నిధి అగర్వాల్‌, నర్గిస్‌ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Updated Date - Dec 01 , 2024 | 06:39 AM