కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకుని సినిమా తీశారు
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:55 AM
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి జానీ మాస్టర్ తన సతీమణి ఆయేషాతో కలసి వచ్చారు. లైంగిక వేధింపు కేసులో బెయిలు పొంది బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ‘‘రాకేశ్ చాలా మంచి వ్యక్తి.....
నా భార్య అండగా నిలిచింది
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి జానీ మాస్టర్ తన సతీమణి ఆయేషాతో కలసి వచ్చారు. లైంగిక వేధింపు కేసులో బెయిలు పొంది బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ‘‘రాకేశ్ చాలా మంచి వ్యక్తి. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి. ఇక్కడ అందరూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చినవారే. భర్తకు భార్య సహకారం ఎప్పటికీ ఉంటుంది. నా జీవితంలో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల్లో ఆయేషా ఎంతో తోడ్పాటును అందించారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నా వెన్నంటే నిలిచింది. భార్యగానే కాకుండా, తల్లిలా.. స్నేహితురాలిలా నా వెనుకే అండగా ఉండి కష్టకాలంలో ముందుకు నడిపిచింది’’ అని చెప్పారు.
హరీశ్ రావు
రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకుడు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ‘‘నాకు సినిమాలతో పరిచయం తక్కువ. అందుకే సినిమా వేడుకలకి రావడం అరుదు. అయితే రాకేశ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనని ఆశీర్వదించాలనిపించింది. ఓ మారుమూల పల్లె నుంచి ఆయన ఇక్కడి దాకా ఎదిగిన క్రమం అందరికీ స్ఫూర్తిదాయకం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకుని రాకేశ్ ఈ సినిమా తీయడం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించండి’’ అని హీరో రాకేశ్ కోరారు.