పెళ్లి విందులు.. చిందులు
ABN, Publish Date - Aug 31 , 2024 | 06:01 AM
పెళ్లిలో జరిగే విందులు, చిందుల్ని కన్నుల విందుగా చూపిస్తున్న చిత్రం ‘లగ్గం’. సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. రమేశ్ చెప్పాల దర్శకుడు.
పెళ్లిలో జరిగే విందులు, చిందుల్ని కన్నుల విందుగా చూపిస్తున్న చిత్రం ‘లగ్గం’. సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. రమేశ్ చెప్పాల దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన హీరో ఆది సాయికుమార్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘కథ, కథనం ఈ సినిమాకు బలం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలసి చూసేలా సినిమా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పారు. కథ నచ్చి ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. ‘లగ్గం’ సినిమా చేయడం తన అదృష్టం అని సాయిరోనక్ చెప్పారు.