అన్నయ్య హగ్ చేసుకున్నాడు
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:41 AM
తమిళ నటుడు కార్తీ నటించిన తాజా చిత్రం ‘సత్యమ్ సుందరమ్’. ‘96’ ఫేమ్ సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. అరవింద స్వామి కీలక పాత్ర...
తమిళ నటుడు కార్తీ నటించిన తాజా చిత్రం ‘సత్యమ్ సుందరమ్’. ‘96’ ఫేమ్ సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. ఈ నెల 28న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా హీరో కార్తీ మీడియాతో ముచ్చటించారు.
‘‘ఈ సినిమా స్ర్కిప్ట్‌ను చదవగానే నా కళ్ల వెంట ఆనందభాష్పాలు వచ్చాయి. అద్భుతమైన మానవ విలువలు ఉన్న కథ ఇది. ఈ కథను మొదట దర్శకుడు నవలగా తీసుకువద్దామని రాసుకున్నారు. అదృష్టవశాత్తు ఇది సినిమాగా తెరకెక్కింది. ఇందులో నాది అమాయకత్వం.. చలాకీతనం కలగలసిన క్యారెక్టర్. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన ఫీల్ గుడ్ చిత్రమిది. నా పాత్ర, అరవింద స్వామి పాత్ర గుర్తుండిపోతాయి.
‘96’ చిత్రంలాగే.. ఈ సినిమా కథ కూడా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. గ్రామీణ జీవితాన్ని.. మన సంప్రదాయాల్ని.. మూలాల్ని తిరిగి గుర్తుచేసేలా ఉండే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గోవింద్ వసంత్ అందించిన మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంటుంది. ప్రతీ పాట అర్థవంతంగా ఉండి హృదయాల్ని కదిలిస్తుంది. ప్రేక్షకులకు రియల్ ఎమోషన్స్‌ను పరిచయం చేసే ఇలాంటి చిత్రాలు రావడం చాలా అరుదు. ఈ సినిమాను చూసిన అన్నయ్య సూర్య చేసుకుని హగ్ చేసుకుని ప్రశంసించారు. నా మొదటి సినిమా తర్వాత ఇన్నేళ్లకు అన్నయ్య అంతలా ఎక్సైట్ అయిన చిత్రమిదే’’ అని చెప్పారు.