కాపీరైట్‌ ఉల్లంఘన జరగలేదు

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:03 AM

బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతారకు, హీరో ధను్‌షకు మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తన చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశాలను

నోటీసులపై నయనతార లాయర్‌ స్పందన

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతారకు, హీరో ధను్‌షకు మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తన చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశాలను వినియోగించారని పేర్కొంటూ నయనతార దంపతులపై ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టులో దావా వేయగా, దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు నయన్‌ దంపతులకు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై నయనతార న్యాయవాది రాహుల్‌ ధవాన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నయనతార డాక్యుమెంటరీలో ఎలాంటి కాపీరైట్‌ ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు. అందులో ఉపయోగించిన క్లిప్లింగ్స్‌ ‘నానుం రౌడీ దాన్‌’ సినిమాలోని సన్నివేశాలు కాదని, అవి వ్యక్తిగత లైబ్రరీలోని బీటీఎ్‌సకు సంబంధించినవని స్పష్టంచేశారు.

వడ్డీతో సహా తిరిగొస్తుంది

ఇదిలా ఉంటే నయనతార శుక్రవారం కర్మ సిద్ధాంతాన్నిపేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘అబద్దాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేయాలని చూసేవాళ్లు దాన్నొక అప్పుగా భావించండి. ఏదో ఒక రోజున మీకు వడ్డీతో సహా తిరిగొస్తుందని గుర్తు పెట్టుకోండి’ అనేది ఆ పోస్ట్‌ సారాంశం. నయనతార ఈ పోస్ట్‌ ద్వారా ధనుష్‌కు వార్నింగ్‌ ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 30 , 2024 | 05:03 AM