కుర్రోళ్ల కష్టం కనిపించింది

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:41 AM

నిహారిక కొణి దెల సమర్పణలో రూపుదిద్దుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని చూసిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ సినిమా టీమ్‌ను తన ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. నిహారిక, దర్శకుడు యదు వంశీ తదితరులు...

నిహారిక కొణి దెల సమర్పణలో రూపుదిద్దుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని చూసిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ సినిమా టీమ్‌ను తన ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. నిహారిక, దర్శకుడు యదు వంశీ తదితరులు ఆయన్ని కలిశారు. ‘సినిమా చాలా చక్కగా ఉంది. కొత్త వాళ్లు నటిస్తున్నారనే విషయాన్ని సినిమా చూస్తున్నంతసేపూ మరిచిపోయా. చిత్రీకరణ చాలా సహజంగా ఉంది. ఎంటైర్‌ యూనిట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. రీజనబుల్‌ బడ్జెట్‌లో సినిమా తీసిన దర్శకుడు యదు వంశీకి అభినందనలు’ అని ప్రశంసించారు చిరంజీవి.

Updated Date - Aug 20 , 2024 | 02:41 AM