ప్రేక్షక దేవుళ్లు కరుణించారు
ABN, Publish Date - Aug 04 , 2024 | 03:46 AM
‘ఒక కొత్త హీరో నటించిన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘ప్రేక్షక దేవుళ్లు’ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది’ అన్నారు...
‘ఒక కొత్త హీరో నటించిన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘ప్రేక్షక దేవుళ్లు’ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది’ అన్నారు ‘అలనాటి రామచంద్రుడు’ చిత్ర హీరో కృష్ణవంశీ. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించిందని శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్‌లో వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్మాత శ్రీరామ్ జడపోలు కృతజ్ఞతలు తెలిపారు.