మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

The 100 : మంచి సందేశంతో ది 100

ABN, Publish Date - Mar 15 , 2024 | 05:13 AM

‘సినిమా అనేది శక్తిమంతమైన ఆయుధం. దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది. ‘ది 100’ చిత్ర ఇతివృత్తం బాగుంది. ఇందులో మంచి సందేశం ఉంది. ఇంత చక్కని చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలకు, హీరో సాగర్‌కు అభినందనలు...

‘సినిమా అనేది శక్తిమంతమైన ఆయుధం. దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది. ‘ది 100’ చిత్ర ఇతివృత్తం బాగుంది. ఇందులో మంచి సందేశం ఉంది. ఇంత చక్కని చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలకు, హీరో సాగర్‌కు అభినందనలు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘మొగలిరేకులు’ ఫేమ్‌ ఆర్కే సాగర్‌ హీరోగా, ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ది 100’ చిత్రం ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, ప్రసంగించారు. ‘ఇది ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. కమర్షియల్‌ అంశాలతో పాటు ఓ సోషల్‌ ఇష్యూని చెప్పాం. అందరూ చూడదగ్గ చిత్రం’ అని దర్శకుడు చెప్పారు. ‘ది 100’ అనేది ఒక వెపన్‌. ప్రతి మనిషికీ జీవితంలో ఈ ఆయుధం అవసరం అవుతుంది’ అని సాగర్‌ చెప్పారు. మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రమేశ్‌ కరుటూరి, వెంకీ పూషడపు, కె.తారక్‌రామ్‌ నిర్మించారు.

Updated Date - Mar 15 , 2024 | 05:14 AM