మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RamojiRao: రామోజీరావు.. ఆ కోరిక తీరకుండానే..!

ABN, Publish Date - Jun 08 , 2024 | 03:48 PM

మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు మృతి అందరినీ కలచివేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఒక లెజెండ్‌గా ముద్ర వేయించుకున్న రామోజీరావుకు ఒక కోరిక మాత్రం తీరలేదు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో 100 సినిమాలు నిర్మించాలనే ఆయన కోరిక మాత్రం తీరలేదు.

Ramoji Rao

మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) మృతి అందరినీ కలచివేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఒక లెజెండ్‌గా ముద్ర వేయించుకున్న రామోజీరావుకు ఒక కోరిక మాత్రం తీరలేదు. ఉషాకిరణ్ మూవీస్ (Usha Kiran Movies) బ్యానర్‌లో 100 సినిమాలు నిర్మించాలనే ఆయన కోరిక మాత్రం తీరలేదు. ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన రామోజీరావు ఎన్నో మ‌ర‌పురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మయూరి’, ‘ప్రతిఘటన’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’, ‘ఆనందం’, ‘ఇష్టం’ వంటి ఎన్నో మరుపురాని సినిమాలు ఈ బ్యానర్‌లోనే తెరకెక్కాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)ని ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయం చేసింది కూడా ఈ బ్యానరే.

Also Read- Ramoji Rao Death: భారతరత్నతో సత్కరించడమే సరైన నివాళి!


నాడు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా ప్రతిభావంతులైన యువ ద‌ర్శ‌కుల‌కు, నటీనటులకు అవ‌కాశాలిచ్చి, వారి ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. చివరిగా ఉషాకిరణ్ సంస్థ నుంచి ‘దాగుడుమూత దండాకోర్’ (Dagudumootha Dandakor) సినిమా 2015లో వచ్చింది. 2015 తర్వాత నుంచి ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యానర్‌లో సినిమాలు తెరకెక్కలేదు. అందుకు కారణం వ్యాపారపరంగా లాభాలు సినిమాలలో లేక‌పోయేస‌రికి ఉషా కిరణ్ సంస్ద సినీ నిర్మాణం త‌గ్గించుకుందనేలా అప్పట్లో ప్రచారం జరిగింది. (RIP Ramojirao Sir)


2019 సమయంలో మ‌ళ్లీ ఉషాకిర‌ణ్ మూవీస్ యాక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అప్పటికే ఉషాకిర‌ణ్ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మ‌రో 15 తీస్తే వంద సినిమాలు తెర‌కెక్కించిన ఘ‌న‌త ద‌క్కుతుందని భావించి ఆ మైలు రాయి కోస‌మైనా సినిమాలు చేయాల‌ని రామోజీరావు అప్పట్లో భావించారు. కొన్ని క‌థ‌లు కూడా సిద్ధం చేశారు. ఆ క‌థ‌ల్ని యువ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు కూడా జరిగాయి. 2016 తర్వాత హిట్టు కొట్టిన కొంత‌మంది యువ ద‌ర్శ‌కులకు ఉషాకిర‌ణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంత‌మందికి అడ్వాన్సులూ అందాయి, ఈ సినిమాల‌కు రామోజీ రావు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందింద‌నేలా వార్తలు వచ్చాయి. అయితే కరోనా ఎంట్రీతో మళ్లీ పరిస్థితులు మారిపోయాయి. ప్లాన్ చేసుకున్న సినిమాలు ఆగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పులు రావటంతో.. ఆ సినిమాల నిర్మాణం ముందుకు సాగలేదు. అలా 100 సినిమాలను నిర్మించాలకున్న రామోజీరావు (Ramoji Rao) నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. (Ramoji Rao Wish)

Read Latest Cinema News

Updated Date - Jun 08 , 2024 | 04:18 PM