అది నా దురదృష్టం

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:07 AM

మహేశ్‌బాబు, సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మురారి’. ఇటీవలే ఆ సినిమా రీ రిలీజై క్రేజీ కలెక్షన్లు సాధిస్తున్న తరుణంలో దర్శకుడు...

మహేశ్‌బాబు, సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మురారి’. ఇటీవలే ఆ సినిమా రీ రిలీజై క్రేజీ కలెక్షన్లు సాధిస్తున్న తరుణంలో దర్శకుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. వారితో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నాను. ఆయనకు కథ కూడా చెప్పాను. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసి ఉంటే.. అది పెద్ద హిట్టయ్యేది. ఈ విషయంలో నాది దురదృష్టం అనుకోవాలి’’ అని పేర్కొన్నారు. అలాగే, మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ హీరోగా ‘మురారి’ సీక్వెల్‌ ఉంటుందా అని అభిమానులు ఆయన్ని అడిగారు. ‘‘ఆ సీక్వెల్‌ విషయం గౌతమ్‌ తల్లిదండ్రుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని కృష్ణవంశీ బదులిచ్చారు

Updated Date - Aug 13 , 2024 | 05:07 AM