ఆ నమ్మకాన్ని ‘క’ ఇచ్చింది
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:32 AM
థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకుని ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇచ్చిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ 50 కోట్ల రూపాయల...
థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకుని ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇచ్చిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా విజయవిహారం చేస్తోంది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ల మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఓటీటీలో కూడా విజయం సాధించిన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ‘ డాల్బీ విజన్ 4 కే, అట్మాస్ టెక్నాలజీ వంటి సాంకేతిక విలువలతో ఓటీటీలోకి వచ్చిన తొలి తెలుగు సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. మా సినిమా సక్సెస్‌కు నిర్మాత గోపీ, దర్శకుడు సందీప్ , సుజిత్, డిస్ట్రిబ్యూటర్ వంశీ .. కారణం. మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ చిత్రం కలిగించింది’ అన్నారు.