అది తప్పేమీ కాదు
ABN, Publish Date - Oct 26 , 2024 | 05:54 AM
‘వాల్తేరు వీరయ్య’తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి ఊర్వశీ రౌతేలా. అనంతరం ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రంలో నటిస్తున్నారు. కా
‘వాల్తేరు వీరయ్య’తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి ఊర్వశీ రౌతేలా. అనంతరం ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఊర్వశీ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వయసులో తనకంటే పెద్ద వారైన హీరోలతో యాక్ట్ చేయడంలో తప్పేమీ లేదని, సినిమాల విషయంలో తాను వయసును పెద్దగా పట్టించుకోనని అన్నారు. ‘సింగ్ సాబ్ ద గ్రేట్’తో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. సన్నీ డియోల్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్నా. వయసు పరంగా మా మధ్య 38 ఏళ్ల వ్యత్యాసం. బాలీవుడ్‌లో ఇదొక రికార్డు. నాకు తెలిసినంత వరకూ అంత ఏజ్ గ్యాప్‌తో ఎవరూ స్ర్కీన్ షేర్ చేసుకోలేదు. సన్ని డియోల్ పిల్లలకంటే నేను చిన్నదాన్ని. దర్శకుడు ఆ విధంగా స్ర్కిప్ట్ రాసినప్పుడు, ఆలోచించినప్పుడు నటించడంలో తప్పు లేదు’ అని ఊర్వశీ రౌతేలా వివరించారు.