ఆ 30 నిముషాల ట్రైన్ ఎపిసోడ్ అలరిస్తుంది
ABN, Publish Date - Oct 06 , 2024 | 02:56 AM
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వం’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు....
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వం’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.
గోపీచంద్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది. ఆయనకు నచ్చి ఓకే చేశారు. నా శైలిలో రావాలని ఎనిమిది నెలలు టైమ్ తీసుకున్నా. అభిరుచి కలిగిన నిర్మాత దోనేపూడి ప్రసాద్‌తో పాటు విశ్వప్రసాద్ కూడా జాయిన్ అవడంతో సినిమాకు మరింత బలం వచ్చింది. యాక్షన్, హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో సినిమా ఉంటుంది. ఇందులో ఓ పాప పాత్ర కీలకంగా ఉంటుంది.
దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చినా సినిమాలు చూస్తూ వస్తున్న మార్పులు గమనిస్తూనే ఉన్నా. నా శైలి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఏదో ఒక చోట నా కంటెంట్ వస్తూనే ఉంది. థీమ్‌లు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. దాన్ని క్రాక్ చేయడానికి టైమ్ పడుతుంది.
పదేళ్ల క్రితం హీరో తెలివితేటలతో ఏదైనా సాధించగలడనే కథలు వచ్చాయి. ఈ సినిమా అలా ఉండదు. ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకుని వినోదాత్మకంగా చెప్పా. మేకింగ్ వైజ్ వినూత్నంగా ఉంటుంది. నాకు, గోపీకి ఫ్రెష్ ఫిల్మ్ అవుతుంది.
ఈ సినిమాలోనూ ట్రైన్ ఎపిసోడ్ ఉంది. ట్రైన్ ఎపిసోడ్ అనగానే ‘వెంకీ’ సినిమాతో కంపేర్ చేస్తారని తెలుసు. కానీ దానికీ దీనికీ చాలా తేడా ఉంటుంది. 30 నిమిషాల పాటు వెన్నెల కిశోర్, గణేశ్, నరేశ్, కవిత, చమ్మక్ చంద్ర, షకలక శంకర్‌లతో ట్రైన్ జర్నీ బాగుంటుంది.
విశ్వం అనే పాత్ర జర్నీ ఈ చిత్రం. ఎమోషనల్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. జర్నీలో విశ్వానికి ఎలాంటి వ్యక్తులు కలిశారు, ఆ విషయాలు ఏమిటి అనేవి ఆసక్తికరంగా ఉంటుంది. కంటెంట్ స్ర్టాంగ్‌గా ఉంటేనే థియేటర్‌కు ప్రేక్షకులు వస్తున్నారు. ఆడియన్స్ కూడా వెంకీ తరహా సినిమాలు మిస్ అవుతున్నాయని అంటున్నారు. అందుకే కేర్ తీసుకుని ఈ సినిమా చేశా.