Tharun Bhascker: తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో.. ఇడుపు కాయితం వచ్చేసింది

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:28 PM

తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తూ.. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న యారో సినిమాస్, డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్ 2 చిత్రం అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి బూసం జగన్ మోహన్ రెడ్డి, వేణు ఊడుగుల నిర్మాతలు. ఇడుపు కాయితం పేరుతో తాజాగా మేకర్స్ ఓపెన్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేసింది.

Tharun Bhascker New Movie Announcement

యారో సినిమాస్ (Arrow Cinemas), డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ (Dolamukhi Subhultron Films) తమ లేటెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాయి. ఇది రెండు నిర్మాణ సంస్థలకు సెకండ్ ప్రొడక్షన్ వెంచర్‌ ఇది. నటుడు, దర్శకుడైన తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌తో వంశీరెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రైటర్, డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) అడిషినల్ కంట్రిబ్యూషన్‌తో బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ డెప్త్‌తో కూడిన మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.

Also Read- Thiragabadara Saami Review: రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా లేదా? 


ఈ బ్యానర్స్‌పై రెండో ప్రొడక్షన్‌గా వస్తున్న ఈ చిత్రం కథాపరంగా, ప్రొడక్షన్ క్వాలిటీలో న్యూ స్టాండర్డ్స్‌ని సెట్ చేయనుందనే విషయాన్ని తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ అనే పాత్రను అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్లు సూచించే స్టాంప్ పేపర్‌తో ఇడుపు కాయితం అంటూ యూనిక్ స్టయిల్‌‌‌లో ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని చాలా వెరైటీగా డిజైన్ చేశారు.


‘‘తేదీ 12-12-2024 బేస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి గుడెనుక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ, మర్రిశెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైనా బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పొత్కపల్లి గ్రామ వాస్తవ్యులైనా గోడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్‌కి ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతాంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్షులుగా, కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలే.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి..’’ అంటూ ఈ స్టాంప్‌పై రాసి ఉంది.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కొత్త టాలెంట్‌ని డిస్కవర్ చేయడానికి నటీనటుల కోసం టీమ్ ఓపెన్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేసింది. ఈ సినిమా టెక్నికల్ టీం, ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 02 , 2024 | 04:33 PM