Kamal Haasan: తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు

ABN, Publish Date - Jul 09 , 2024 | 02:26 AM

1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వం వహించగా, సుభాస్కరన్‌ నిర్మించారు. సిద్ధార్థ్‌, బాబీసింహా, ఎస్‌.జే.సూర్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 12న ‘భారతీయుడు 2’ విడుదలవుతున్న...

కమల్‌హాసన్‌ ‘సేనాపతి’గా నటించిన చిత్రం ‘భారతీయుడు2’.

1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వం వహించగా, సుభాస్కరన్‌ నిర్మించారు. సిద్ధార్థ్‌, బాబీసింహా, ఎస్‌.జే.సూర్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 12న ‘భారతీయుడు 2’ విడుదలవుతున్న సందర్భంగా సోమవారం చిత్రబృందం మీడియాతో సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు.

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేసి ఈ స్థాయికి తెచ్చారు. ఈ సినిమాలో ‘సేనాపతి’ క్యారెక్టర్‌ చెప్పే డైలాగ్స్‌ సమాజంలో నుంచి పుట్టినవాటిలా ఉంటాయి. శంకర్‌ విజన్‌ను, మేకింగ్‌ను థియేటర్లలో చూసి


ఆశ్చర్చపోతారు. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేేసది. రెండోది మన బాధ్యతది చెప్పేది’ అని అన్నారు. శంకర్‌ మాట్లాడుతూ ‘భారతీయుడు’ టైమ్‌లో సీక్వెల్‌ తీస్తానని అస్సలు అనుకోలేదు. ఆ మూవీ తరువాత ఇన్నేళ్లలో ఎక్కడ లంచం తీసుకున్నారనే వార్తలు చదివినా నాకు ేసనాపతి గుర్తుకు వచ్చేవారు. కానీ కథ కుదరక ఆగిపోయేవాడ్ని. సినిమాలో నేను రాసిన ప్రతీ సన్నివేశాన్ని కమల్‌హాసన్‌ తన నటనతో పదిరెట్లు పెంచారు’ అని చెప్పారు. సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘భారతీయుడు 2’ సినిమా సమాజంలో జరిగే అవినీతికి ఓ అప్‌డేటెడ్‌ యాంటీ వైరస్‌ లాంటిది. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘బాయ్స్‌’తోనే కెరీర్‌ను ఆరంభించాను. మళ్లీ 20 ఏళ్ల తరువాత ఇందులో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. యువత సమాజం కోసం ఏం చేయాలో చెప్పే చిత్రమిది’ అని చెప్పారు. నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘కమల్‌ హాసన్‌ ఇండియన్‌ సినిమా హద్దుల్ని చెరిపేస్తూ ముందుకు సాగుతుంటారు. డైరెక్టర్‌ శంకర్‌ సోషల్‌ మెసేజ్‌తో పాటు ఎంటర్టైన్‌మెంట్‌ జోడించి సినిమా తీసే విధానం అద్భుతం’ అని అన్నారు. బాబీసింహా మాట్లాడుతూ ‘భారతీయుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’గా ‘సేనాపతి’ వస్తున్నాడు. ఈ చిత్రం మొదటి పార్ట్‌ కంటే పదింతలు హిట్‌ అవుతుంది’ అని అన్నారు. రకుల్‌ ప్రీత్‌ మాట్లాడుతూ ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్‌లో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పారు.

Updated Date - Jul 09 , 2024 | 10:17 AM