New Movie: టైటిల్‌లో ‘గుర్తులేదు’ అని ఉంది కానీ.. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం
ABN, Publish Date - Nov 14 , 2024 | 05:32 PM
‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ఇప్పుడిదే టైటిల్‌తో ఓ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ (Teliyadu Gurtuledu Marchipoya). ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్‌పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు (Venkatesh Veeravarapu) రూపొందిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ కొట్టగా, సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Also Read- Matka Review: 'మట్కా'తో వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా...
ఈ సందర్భగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. మంచి కథ, కథనాలతో ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ సినిమాలోని పాత్రలకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్ఫెక్ట్‌గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నానని అన్నారు.
దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ.. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్‌గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ గారికి, పృథ్వీ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ గారి టీమ్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నామని తెలపగా.. నిర్మాత శరత్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ.. సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. మా మూవీకి సపోర్ట్‌గా నిలుస్తున్న పృథ్వీ గారికి థ్యాంక్స్. అలాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌తో సినిమా నిర్మిస్తున్నాం. ఫస్ట్ చిత్రంతోనే ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నామనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీ, నటుడు భరద్వాజ్ వంటి వారు మాట్లాడుతూ.. తమకిచ్చిన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Also Read-Kanguva X Review: సూర్య 'కంగువ' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
Also Read-Matka: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా.. మట్కా 'ట్విట్టర్' రివ్యూ
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి