కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ నుండి ‘మా ఊరు..’ పాటొచ్చింది

ABN, Publish Date - Jan 02 , 2024 | 09:54 PM

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘మా ఊరు..’ అంటే సాగే లిరికల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Ambajipeta Marriage Band Still

సుహాస్ (Suhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని (Dushyant Katikineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా ట్విట్టర్ ఎక్స్ ద్వారా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో ‘మా ఊరు..’ అంటూ సాగే పాటకి సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట తనకు ఎంతో నచ్చిందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు హీరో తేజ సజ్జా.


‘మా ఊరు..’ పాట విషయానికి వస్తే.. ఈ పాటకు రెహ్మాన్ లిరిక్స్ అందించగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాళభైరవ పాడారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం... ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..’ అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట. హీరోగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సుహాస్.. ఈ సినిమాతో తనకు మరింత గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. ఇందులో ఓ మంచి ప్రేమకథ, మెసేజ్ కూడా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. (Ambajipeta Marriage Band Maa Ooru Song Out)


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

Updated Date - Jan 02 , 2024 | 09:54 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!