త్వరలోనే టీజర్‌

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:21 AM

దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా...

దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా..వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు సరిగ్గా 75 రోజుల సమయమే ఉందంటూ చిత్రబృందం విడుదల చేసిన ఓ పోస్టర్‌ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. త్వరలోనే టీజర్‌ కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన పోస్టర్స్‌.. రెండు పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరోవైపు హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్‌, అజిత్‌, సందీప్‌ కిషన్‌ నటిస్తున్న చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి.

Updated Date - Oct 28 , 2024 | 12:21 AM