‘తల్వార్‌’ ఆకాశ్‌ జగన్నాథ్‌

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:31 AM

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ జగన్నాథ్‌ కొత్త చిత్రం ‘తల్వార్‌’ షూటింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్‌ని పరిచయం చేస్తూ...

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ జగన్నాథ్‌ కొత్త చిత్రం ‘తల్వార్‌’ షూటింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్‌ని పరిచయం చేస్తూ భాస్కర్‌ ఇ.ఎల్‌.వి. నిర్మిస్తున్నారు. ఆకాశ్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్‌ చేయగా, రచయిత విజయేంద్రప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. మరో దర్శకుడు సానా బుచ్చిబాబు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు.

Updated Date - Aug 20 , 2024 | 02:31 AM