ఐదు భాషల్లో సస్పెన్స్ థ్రిల్లర్
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:17 AM
నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘ఎం ఫోర్ ఎం’. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఒడిశా సూపర్ స్టార్ సంబీట్
నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘ఎం ఫోర్ ఎం’. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ తెలుగు నటి జో శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 23న గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దేశీ విదేశీ సినీ ప్రముఖుల సమక్షంలో హిందీ వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మోహన్ వడ్డపట్ల చెప్పారు. ‘ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. మోటివ్ ఫర్ మర్డర్ తెలిసినప్పుడు, మునుపెన్నడూ ఎరుగని సైకోని చూసి సరికొత్త అనుభూతి పొందుతారు. ఐదు భాషల్లో త్వరలో విడుదల చేయబోతున్నాం’ అని ఆయన తెలిపారు. శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, ఎం.ఆర్.సి. వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.