సస్పెన్స్ థ్రిల్లర్
ABN, Publish Date - Sep 26 , 2024 | 01:04 AM
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా రూపుదిద్దుకున్న ‘జ్యూయెల్ థిఫ్’ చిత్రం సెన్సార్ పూర్తయింది. ప్రేమ, అజయ్, పృథ్వీ, శివారెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాను...
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా రూపుదిద్దుకున్న ‘జ్యూయెల్ థిఫ్’ చిత్రం సెన్సార్ పూర్తయింది. ప్రేమ, అజయ్, పృథ్వీ, శివారెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాను పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఈ సందర్భంగా కృష్ణసాయి మాట్లాడుతూ ‘ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. యువతకు బాగా నచ్చుతుంది. శ్రీలేఖ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ పార్ట్ హైలైట్ అవుతుంది’ అని చెప్పారు.