Suriya Birthday Special: ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ వదిలారు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:16 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘కంగువ’ను రెడీ చేస్తున్నారు మేకర్స్. మంగళవారం సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి ‘ఫైర్ సాంగ్’ని మేకర్స్‌ వదిలారు.

Suriya Kanguva Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘కంగువ’ను రెడీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. మంగళవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ (Fire Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ‘ఫైర్ సాంగ్’‌కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. అలాగే శ్రీమణి అంతే పవర్‌ఫుల్ లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌గా ఈ పాటను ఆలపించారు. ‘ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. దైవ జ్వాల.. దావాగ్ని జ్వాల..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ ‘ఫైర్ సాంగ్’ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. (HBD Suriya)


Suriya-Kanguva.jpg

ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ (Director Siva) రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ఒక కొత్త కాన్సెప్ట్‌‌తో ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పది భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్రీడీలోనూ మేకర్స్ విడుదల చేస్తుండటం విశేషం. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా చెబుతూ.. మేకర్స్ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. (Kanguva Fire Song)

Read Latest Cinema News

Updated Date - Jul 23 , 2024 | 04:16 PM

Kanguva: టీజర్‌ అదరహో.. అంచనాలు పెరగడంతో టార్గెట్‌ మారిపోయింది!

Kanguva: సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’.. నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే..

Kanguva: సూర్యకి ప్రమాదం, షూటింగ్ నిలిపివేత

Kanguva Producer: డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో అంత గబరా పడటం లేదు!

Kanguva: ‘కంగువ’ డబుల్ డోప్ పోస్టర్.. అదిరిపోలా..