Kanguva: సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’.. నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే..

ABN , Publish Date - Jul 04 , 2024 | 07:38 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ భారీ లెవల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను నైజాంలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారో మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

Kanguva Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో (Suriya) సూర్య నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri Movie Distributors) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సూర్య కెరీర్‌లో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోన్న ‘కంగువ’ను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో సినిమా మరింత ఎగ్జైట్‌మెంట్ ఏర్పడుతోంది.

Also Read- Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటి వరకు తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలుండటం గమనార్హం. (Kanguva Nizam Release Details)


Kanguva.jpg

ఈ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 04 , 2024 | 07:38 PM