Lal Salaam: సంక్రాంతికి మిస్సయిన ‘లాల్ సలామ్’ రిలీజ్ ఎప్పుడంటే..
ABN, Publish Date - Jan 09 , 2024 | 07:26 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) కీలక పాత్రలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’ (Lal Salaam). లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
‘జైలర్’ (Jailer) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదీ కాకుండా ఆయన ‘బాషా’ చిత్రం తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ఇది. ఇందులో ఆయన మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మంచి క్రికెటర్స్, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆటను మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ ఎలా సర్దుబాటు చేశారు? ప్రజల మధ్య ఎలాంటి సఖ్యతను కుదిర్చారనేది ‘లాల్ సలామ్’ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. (Lal Salaam Release Date)
రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటించారు. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Ashika Ranganath: ‘నా సామిరంగ’లో నేను రెబల్..
**************************
*Katrina Kaif: చెన్నై నా సెకండ్ హోం టౌన్
***************************
*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..
*************************