Mahesh Babu: సింహానికి సూపర్‌స్టార్ వాయిస్ ఓవర్..

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:12 PM

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు సింహానికి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. అల్టిమేట్ జంగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ లెగసీని గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్-యాక్షన్ ‘ది లయన్ కింగ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధమవుతోంది. ఈసారి ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

Mahesh Babu and Mufasa The Lion King Poster

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సింహానికి వాయిస్ ఓవర్ (Voice Over) ఇవ్వబోతున్నారు. అల్టిమేట్ జంగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లెగసీని గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్-యాక్షన్ ‘ది లయన్ కింగ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధమవుతోంది. ‘ముఫాసా’ (Mufasa)కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు ప్రముఖ నటులు బ్రహ్మానందం (Brahmanandam) పుంబాగా, అలీ (Ali) టిమోన్‌గా తిరిగి వస్తున్నారు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను

ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మాట్లాడుతూ.. “డిస్నీ (Disney) బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ నాకెంతో ఇష్టం. ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు బాధ్యతాయుతంగా ఉంటుంది. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ను నా కుటుంబంతో కలిసి నేను, అలాగే నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు.


డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ.. “కథా కథనానికి మరింత పర్శనల్ టచ్ తీసుకురావడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పరస్పర చర్చ జరపడం, వారు తమ కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన భాషలో సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేసేలా చేయడం మా లక్ష్యం. ముఫాసా ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు ముఫాసా వాయిస్‌కి జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అంతా సెలబ్రేట్ చేసుకునే సమయం’’ అని అన్నారు. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 20 డిసెంబర్, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో ఇండియన్ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. (Mufasa The Lion King Release Date)

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 05:12 PM