Mirai: తేజ సజ్జా బర్త్‌డే స్పెషల్.. ‘మిరాయ్’ నుంచి అప్డేట్

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:32 PM

‘హను-మాన్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకుని, సూపర్ హీరో క్రేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా.. మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారు. తేజ సజ్జా బర్త్‌డే స్పెషల్‌గా శుక్రవారం ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు.

Super Hero Teja Sajja in Mirai Movie

‘హను-మాన్’ (Hanu-Man)తో పాన్ ఇండియా సక్సెస్ అందుకుని, సూపర్ హీరో క్రేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja).. మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్‌’ (Mirai Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. శుక్రవారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘మిరాయ్’ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం


ఈ పోస్టర్ విషయానికి వస్తే.. సినిమాలో తేజ సజ్జా పాత్రలోని కరేజియస్ స్పిరిట్‌ని హైలైట్ చేస్తూ పోస్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పోస్టర్‌లో తేజ సజ్జా మండుతున్న ఐరెన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తున్నట్లు టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ ఇంటెన్స్‌గా వున్నారు. బ్యాక్ డ్రాప్‌లో వెనుక ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ పోస్టర్ ప్రేక్షకులని ఆకర్షించడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. తేజ సజ్జా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా కోసం బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారనేది ఈ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో స్పష్టంగా తెలుస్తోంది. (Happy Birthday Teja Sajja)


న్యూ వరల్డ్‌ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని నైపుణ్యం ఎలాంటిదో ఇప్పటికే ప్రేక్షకులకు తెలుసు. మరో అద్భుతాన్ని ఆయన సినిమాతో ప్రేక్షకులకు చూపించబోతున్నారని, అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా టెక్నికల్‌గా టాప్ క్లాస్‌లో వుండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. తేజ సజ్జ, మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాకుండా.. సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. గౌర‌హ‌రి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాను 8 భాషల్లో 18 ఏప్రిల్, 2025న వేసవిలో 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Mirai New Poster)

Updated Date - Aug 23 , 2024 | 03:32 PM