Sundeep Kishan 30: నక్కిన, సందీప్ కిషన్ సినిమా టైటిల్ ఇదే !

ABN, Publish Date - Jun 22 , 2024 | 02:08 PM

దర్శకుడు నక్కిన త్రినాథ రావు, సుందీప్ కిషన్ 30వ సినిమాగా చిత్రీకరణ మొదలు పెట్టిన సినిమా టైటిల్ ఖరారు అయిందని తెలుస్తోంది! ఈసారి కూడా మంచి ధమాకా లాంటి టైటిల్ నక్కిన, ప్రసన్నలకి దొరికింది అని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా...

Nakkina Trinadha Rao and Sundeep Kishan

దర్శకుడు నక్కిన త్రినాథ రావు, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మళ్ళీ చేతులు కలిపి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఇంకొక ప్రధాన పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. రీతు వర్మ, అన్షు అంబానీ లు సందీప్, రావు రమేష్ పక్కన జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు హైదరాబాదులో అవుతోంది. ఇందులో సందీప్ కిషన్, రీతు వర్మ, అన్షు అంబానీ, ఇంకా మరికొంతమంది ఆర్టిస్టులు వున్నారని కూడా తెలిసింది. (Nakkina Trinadha Rao and Sundeep Kishan combination film gets a title now)

అయితే ఈ సినిమాకి ఇంతవరకు ఎటువంటి టైటిల్ పెట్టలేదు, ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పుడు కేవలం #SK30 అని మాత్రమే అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు నక్కిన త్రినాథ రావు, రవి తేజ కాంబినేషన్ లో 'ధమాకా' సినిమా విజయవంతమై రూ.100 కోట్లకి పైగా కలెక్టు చేసిందని తెలుసు కదా. (Majaka is the title for Sundeep Kishan and Nakkina Trinadha Rao combination film)

ఇప్పుడు ఈ సందీప్ కిషన్ సినిమాకి కూడా అలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అని నక్కిన త్రినాథ రావు, బెజవాడ ప్రసన్న కుమార్ ఇద్దరూ అనుకున్నారు. అందుకే ఈ సినిమాకి 'మజాకా' అని టైటిల్ పెడుతున్నట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ కొన్ని రోజుల్లో ఈ సినిమా టైటిల్ రెవీల్ చెయ్యొచ్చు అని తెలిసింది. రాజేష్ దంద ఈ సినిమాకి నిర్మాత.

Updated Date - Jun 22 , 2024 | 02:08 PM