Jatadhara: సుధీర్ బాబు సినిమాకు టైటిల్ ఫిక్సయింది.. మళ్లీ శివుడే!

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:49 PM

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘హరోంహర’ సినిమా ఇటీవల విడుదలైన మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇప్పుడాయన పాన్- ఇండియా సినిమాటిక్ యూనివర్స్‌లో తన కెరీర్‌ను న్యూ హైట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీకి ‘జటాధర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Sudheer Babu New Film Jatadhara Still

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన ‘హరోంహర’ (Harom Hara) సినిమా ఇటీవల విడుదలైన మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇప్పుడాయన పాన్- ఇండియా సినిమాటిక్ యూనివర్స్‌లో తన కెరీర్‌ను న్యూ హైట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీతో సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్‌లోకి సుధీర్ బాబు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి ‘జటాధర’ (Jatadhara) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Also Read- Kalki 2898AD OTT: ‘కల్కి 2898AD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?


శుక్రవారం ఈ మూవీ టైటిల్ విషయమే సుధీర్ బాబు ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయండి అంటూ.. కొన్ని క్లూస్ ఇచ్చారు. ఈ క్లూస్‌తో నెటిజన్లు చాలా మంది ఈ సినిమా టైటిల్‌ను గెస్ చేసి, కామెంట్ చేశారు. వారు కామెంట్ చేసినట్లుగా ఈ సినిమాకు ‘జటాధర’ అనేదే టైటిల్ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘జటాధర’ ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ రెండింటిలోనూ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Sudheer Babu Next Film Title Jatadhara)


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సుధీర్ బాబుని పవర్ ఫుల్, స్ట్రాంగ్ అవతార్‌లో ప్రెజెంట్ చేసింది. సుధీర్ బాబు తన చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నారు. సిక్స్-ప్యాక్ అబ్స్‌‌తో మాచోలా కనిపిస్తున్నారు. రుస్తోమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి లాంటి సూపర్ హిట్స్ అందించిన విజనరీ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా నిర్మాణ భాగస్వామిగా వున్న ఈ ఎక్సయిటింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయనున్నారని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ ‘జటాధర’ సినిమాను 2025 మహాశివరాత్రికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించేశారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 17 , 2024 | 03:49 PM