Raj Tarun : ఆధారాలు సమర్పించండి..

ABN, Publish Date - Jul 07 , 2024 | 05:45 AM

సినీ హీరో రాజ్‌తరుణ్‌ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేసిన లావణ్య అనే మహిళకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న

సినీ హీరో రాజ్‌తరుణ్‌ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేసిన లావణ్య అనే మహిళకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆధారాలను విచారణ నిమిత్తం తమకు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. లావణ్య ఆధారాలు సమర్పిస్తేనే ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుంది. లేదంటే కోర్టు అనుమతితో పోలీసులు కేసును చట్ట ప్రకారం మూసివేస్తారు.

Updated Date - Jul 07 , 2024 | 05:45 AM