‘సర్దార్-2’ షూటింగులో స్టంట్‌మేన్ మృతి
ABN, Publish Date - Jul 18 , 2024 | 12:39 AM
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్-2’ చిత్రం షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం ఒక ఫైట్ చిత్రీకరిస్తుండగా, 20 అడుగుల ఎత్తు నుంచి ఫైట్ ట్రైనర్ (స్టంట్‌మేన్) ఏళుమలై...
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్-2’ చిత్రం షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం ఒక ఫైట్ చిత్రీకరిస్తుండగా, 20 అడుగుల ఎత్తు నుంచి ఫైట్ ట్రైనర్ (స్టంట్‌మేన్) ఏళుమలై ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో మంగళవారం ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఫైట్ రిహార్సల్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఏళుమలై కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నిర్మాత లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి)