అసత్య ప్రచారాన్ని ఆపండి
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:22 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన భార్య సైనా బానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు...
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన భార్య సైనా బానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు రెహమాన్ కుటుంబ సభ్యులు తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్‌గా మరో వార్త వైరల్ అవుతోంది. వైవాహిక బంధానికి స్వస్తి పలికిన రెహమాన్..సంగీతానికి కొంత కాలం దూరంగా ఉండనున్నారంటూ కోలివుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. రెహమాన్ మ్యూజిక్‌ని మిస్ అవ్వాల్సిందేనా? అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్టులు పెట్టారు. ఈ వార్తలపై ఇప్పటికే రెహమాన్ కుమార్తె ఖతీజా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అయినా రూమర్లు ఆగకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరోసారి రియాక్ట్ అయ్యారు. ‘దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి’ అని విజ్ఞప్తి చేశారు. వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ అలా రాయడం సబబు కాదన్నారు.