డ్రగ్స్‌కి దూరంగా ఉండండి

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:30 AM

‘‘ఫెయిల్యూర్‌ అనేది ఎంత ప్రమాదకరమో ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. ఈ చిత్రంలో నా ముగ్గురు పుత్రులకీ ఒక్కో సమస్య ఉంటుంది. ఇందులో కాలేజ్‌ లెక్చరర్‌ పాత్రలో నటించాను...

‘‘ఫెయిల్యూర్‌ అనేది ఎంత ప్రమాదకరమో ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. ఈ చిత్రంలో నా ముగ్గురు పుత్రులకీ ఒక్కో సమస్య ఉంటుంది. ఇందులో కాలేజ్‌ లెక్చరర్‌ పాత్రలో నటించాను. ఈ సోషల్‌ మీడియా యుగంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్‌ సరిగ్గా ఉండటం లేదు. కలసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైమ్‌లో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్‌ సపోర్ట్‌ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి’’ అని నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఉమాదేవి, శరత్‌చంద్ర చల్లపల్లి నిర్మించిన ఈ చిత్రం 12న విడుదలవుతోంది. బుధవారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రతీ ఇంట్లో జరిగే కథలా రిలేటబుల్‌గా ఉంది. మంచి సందేశంతో దర్శకుడు చిత్రాన్ని తీశారు’’ అని అన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:30 AM