శ్రీమురళి... రెండు సినిమాలు
ABN, Publish Date - Dec 18 , 2024 | 02:22 AM
ఇటీవలే ‘బఘీర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కన్నడ హీరో శ్రీ మురళి. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం...
ఇటీవలే ‘బఘీర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కన్నడ హీరో శ్రీ మురళి. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం ఖరారైంది. ఈ విషయాన్ని మంగళవారం నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. శ్రీమురళి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఇది 47వ సినిమా. కాగా, మరో సంస్థ ‘బ్రాండ్ స్టూడియోస్’ శ్రీమురళీతో ‘పరాక్’ అనే సినిమాను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శ్రీమురళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది ‘బ్రాండ్ స్టూడియోస్’ చిత్రబృందం.