Kantara: సౌత్ వర్సెస్ నార్త్.. గెలిచేదెవరు

ABN, Publish Date - Oct 14 , 2024 | 12:38 PM

ఇప్పటికే రిలీజై మాస్ యాక్షన్ సీన్లతో ఆడియెన్స్ బుర్రపాడు చేసిన సినిమాకి సీక్వెల్ ఒక వైపు అయితే తక్కువ బడ్జెట్ తెరకెక్కి భారత సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ సినిమా ప్రీక్వెల్ మరోవైపు. ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌పై ఫ్యాన్స్‌తో పాటు నిర్మాతలు హ్యుజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ.. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో ఆ సినిమాలకే నష్టం అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..

War 2 Vs Kantara 2

వచ్చే ఏడాది రిలీజ్ కానున్న రెండు భారీ సినిమాలు నిర్మాతలతో పాటు అభిమానుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ అంటూ రచ్చలేపుతున్నాయి. ఇప్పటికే రిలీజై మాస్ యాక్షన్ సీన్లతో ఆడియెన్స్ బుర్రపాడు చేసిన సినిమాకి సీక్వెల్ ఒక వైపు అయితే తక్కువ బడ్జెట్ తెరకెక్కి భారత సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ సినిమా ప్రీక్వెల్ మరోవైపు. ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌పై ఫ్యాన్స్‌తో పాటు నిర్మాతలు హ్యుజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ.. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో ఆ సినిమాలకే నష్టం అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..


గతంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా బాలీవుడ్ తెరకెక్కించిన 'వార్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సీక్వెల్ 'వార్ 2'ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తూ మేకర్స్ కీ రోల్ లో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీయార్(Jr NTR) ని క్యాస్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమా నార్త్ తో పాటు సౌత్‌లోను కలెక్షన్ల సూనామీ కురిపించేలా ప్లాన్ చేశారు. మరోవైపు కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రైడ్ 'కాంతారా' తక్కువ బడ్జెట్ లో వచ్చి 300 కోట్ల భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రీక్వెల్ 'కాంతారా చాఫ్టర్ 1'ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలని వచ్చే ఏడాది ఆగష్టు మాసంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలు రెండు కలిపి 1000 కోట్లకుపై మార్కెట్ చేసే అవకాశం ఉంది. కానీ.. రెండు సినిమాల రిలీజ్ డేట్ల మధ్య వారం వ్యత్యాసం ఉన్న ఇంకో సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. దీంతో రిలీజ్ ఎలా ప్లాన్ చేయాలో అని అటు నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ లో కూడా కలవరం ఏర్పడింది.

Updated Date - Oct 14 , 2024 | 12:38 PM