విడుదలకు ముందే అరవై అవార్డులు
ABN, Publish Date - Sep 15 , 2024 | 02:53 AM
హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫియర్’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకురాలు హరిత గోగినేని రూపొందిస్తున్నారు. సుజాత రెడ్డితో కలసి ఏ.ఆర్ అభి నిర్మిస్తున్నారు...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫియర్’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకురాలు హరిత గోగినేని రూపొందిస్తున్నారు. సుజాత రెడ్డితో కలసి ఏ.ఆర్ అభి నిర్మిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ‘ఫియర్’ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అరవైకి పైగా అవార్డులు పొంది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఫియర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు ప్రభు దేవా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. త్వరలో థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.