Magic: ‘మ్యాజిక్’ రిలీజ్ ఎప్పుడో.. సితార చెప్పేసింది

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:26 PM

అవును ‘మ్యాజిక్’ రిలీజ్ ఎప్పుడో.. సితార చెప్పేసింది. ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడీ బ్యానర్‌లో ‘జెర్సీ’ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ‘మ్యాజిక్’ రిలీజ్ వివరాలను సదరు సంస్థ ప్రకటించింది.

Magic Movie Still

అవును ‘మ్యాజిక్’ (Magic) రిలీజ్ ఎప్పుడో.. సితార చెప్పేసింది. ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ‘మ్యాజిక్‌’ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. బుధవారం అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా 21 డిసెంబర్, 2024న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉండటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

Also Read- Akhanda 2: బాలయ్య పెద్ద కుమార్తె క్లాప్.. చిన్న కుమార్తె స్విచ్ఛాన్


ఈ చిత్ర థీమ్ ఏంటంటే.. ‘తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. కల నెరవేరాలంటే మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని అందమైన ప్రయాణంలా చూపించే ‘మ్యాజిక్’ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులను మాయ చేస్తుందని, ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. (Magic Movie Release Date)


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రానికి, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపేందుకు త్వరలోనే మేకర్స ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేయనున్నారు.

Also Read- Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2024 | 12:26 PM