సందేశాన్నిచ్చే ‘సింబా’

ABN, Publish Date - Aug 05 , 2024 | 06:19 AM

జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 9న సినిమా...

జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ‘‘ఇది ప్రకృతి మీద ఉన్న ప్రేమతో తీసిన సినిమా. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని తెలిపారు. నిర్మాత సంపత్‌ నంది మాట్లాడుతూ ‘‘ఈ సినిమా వినోదంతో పాటు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇది సమాజం కోసం తీసిన సినిమా’’ అని అన్నారు. ‘‘సినిమా చాలా కొత్త పాయింట్‌తో ఉంటుంది. సంపత్‌ నంది అద్భుతమైన కథను ఇచ్చారు’’ అని దర్శకుడు మురళీ మనోహర్‌ చెప్పారు. ‘‘వనజీవి రామయ్య’ జీవితం ఆధారంగా ఈ కథను రాసుకున్నారు సంపత్‌ నంది’’ అని నిర్మాత దాసరి రాజేందర్‌రెడ్డి అన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 06:19 AM