సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’
ABN, Publish Date - Aug 07 , 2024 | 12:58 AM
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటించే కొత్త చిత్రం ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా...
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటించే కొత్త చిత్రం ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. 30 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. తొలి రోజు షూటింగ్‌లో రాశీ ఖన్నా కూడా పాల్గొన్నారు. శ్రీనిధి శెట్టి మరో కథానాయిక. వైవా హర్ష ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని, జ్ఞానశేఖర్ బాబా ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.