Shraddha Srinath: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’లో శ్రద్ధా శ్రీనాథ్‌.. ఫస్ట్ లుక్ విడుదల

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:39 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’తో దీపావళి రేసులో ఉన్నారని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Shraddha Srinath in Mechanic Rocky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)తో దీపావళి రేసులో ఉన్నారని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Niharika Konidela: దయచేసి కళ్యాణ్ బాబాయ్ గురించి అలాంటి ప్రశ్నలు అడగకండి..

ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మెకానిక్ రాకీ’ ఎక్సయిటింగ్ రైడ్‌కు శ్రద్ధా శ్రీనాథ్‌‌ని స్వాగతిస్తూ, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ అల్ట్రా మోడిష్‌గా ఈ లుక్‌లో కనిపిస్తోంది. చర్మిస్మాటిక్ స్మైల్‌తో కనిపించిన ఫస్ట్ లుక్ చాలా ఎట్రాక్టివ్‌గా వుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Shraddha Srinath First Look From Mechanic Rocky)


Shaddha-Srinath-Pic.jpg

హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్; సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 21 , 2024 | 09:39 PM