Shobana: ప్రభాస్ సినిమాతో 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ..

ABN, Publish Date - Jun 19 , 2024 | 01:52 PM

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘కల్కి 2898 AD’ చిత్రంతో.. అలనాటి తార శోభన దాదాపు 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో శోభన నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. తాజాగా మేకర్స్ ఆమె లుక్‌ని రివీల్ చేయడంతో.. ప్రస్తుతం ఆమె పేరు, మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.

Shobana in Kalki 2898AD

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) చిత్రంతో.. అలనాటి తార శోభన (Shobana) దాదాపు 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో శోభన నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. తాజాగా మేకర్స్ ఆమె లుక్‌ని రివీల్ చేయడంతో.. ప్రస్తుతం ఆమె పేరు, మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.

Also Read- Vijay: విజయ్‌ పార్టీలో చేరనున్న ఆ ఇద్దరు నటులు?

ఇప్పటికే ఈ ‘కల్కి 2898 AD’లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పాత్రని, అమితాబ్ పాత్రని మేకర్స్ ఆల్రెడీ పరిచయం చేశారు. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 27 జూన్ 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సినిమాలోని మెయిన్ పాత్రలను మేకర్స్ పరిచయం చేస్తున్నారు. అందుబో భాగంగా శోభన ఇందులో మరియం (Mariam) పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ రివీల్ చేశారు.


ఆమె పాత్రకు సంబంధించి ‘ఆమె పూర్వీకులు కూడా ఆమెలానే వేచి ఉన్నారు’ అనే మేకర్స్ పోస్ట్ చేసిన క్యాప్షన్‌ చూస్తుంటే ఇందులో శోభనది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుంది? 18 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న శోభనను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే మాత్రం జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ని భారీ స్థాయిలో మేకర్స్ ప్లాన్ చేశారు. బుధవారం ముంబైలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 19 , 2024 | 01:52 PM