Pourusham: యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ‘పౌరుషం - ది మ్యాన్‌హుడ్’.. ట్రైలర్ విడుదల

ABN, Publish Date - Jul 05 , 2024 | 07:50 PM

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పౌరుషం - ది మ్యాన్‌హుడ్’. UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు.

Pourusham The Man Hood Movie Trailer Launch

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పౌరుషం - ది మ్యాన్‌హుడ్’ (Pourusham The Man Hood). UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్-సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Pourusham The Man Hood Trailer)

Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..


‘పౌరుషం - ది మ్యాన్‌హుడ్’ ట్రైలర్‌ చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయనేది ఈ ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీతా రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 05 , 2024 | 07:50 PM