షెకావత్ సాబ్
ABN, Publish Date - Aug 09 , 2024 | 12:43 AM
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ఫ 2’ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో హీరోతో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు...
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ఫ 2’ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో హీరోతో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు పాల్గొనగా పతాక సన్నివేశాలు తీస్తున్నారు. బన్వర్‌సింగ్ షెకావత్‌గా నటిస్తున్న పహాద్ ఫాజిల్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు. గళ్ల లుంగీ, ఒక చేతిలో గన్, మరో చేతిలో గొడ్డలితో పహాద్ కనిపిస్తున్నారు. డిసెంబర్ 6న ‘పుష్ఫ 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో నవీర్ యర్నేని, రవిశంకర్ యలమంచి నిర్మిస్తున్నారు.