అమ్మగా నటించడానికి ఇబ్బంది పడలేదు

ABN, Publish Date - Sep 01 , 2024 | 05:36 AM

ఇప్పుడు సొసైటీలో 22 ఏళ్లకే పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. అందుకే నేను హౌస్‌ వైఫ్‌గా, అమ్మగా నటించడానికి ఇబ్బంది పడలేదు. నటిగా అన్ని పాత్రలూ చేయాలి. అయితే తల్లిగా బాగా చేశావు అనేకంటే...

ఇప్పుడు సొసైటీలో 22 ఏళ్లకే పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. అందుకే నేను హౌస్‌ వైఫ్‌గా, అమ్మగా నటించడానికి ఇబ్బంది పడలేదు. నటిగా అన్ని పాత్రలూ చేయాలి. అయితే తల్లిగా బాగా చేశావు అనేకంటే సరస్వతి పాత్రను చక్కగా పోషించావని అంటే సంతోషిస్తా’ అన్నారు నివేదా థామస్‌. రానా సమర్పణలో రూపుదిద్దుకున్న ‘ 35.. చిన్న కథ కాదు’ చిత్రం ఈ నెల ఆరున విడుదలవుతున్న సందర్భంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇందులో సరస్వతి పాత్రకు, నాకు వయసులో పెద్ద తేడా లేదు. సరస్వతి నాకంటే ఏడాది చిన్నది. తనకు పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ చైల్డ్‌ నేచర్‌ ఉంటుంది. ‘35 చిన్న కథ కాదు.. కథని దర్శకుడు నందకిశోర్‌ అద్భుతంగా రాశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కూడా ఈ కథలో ఓ పాత్ర పోషించారు. ఆ డివైన్‌ ఫీలింగ్‌ అన్ని సీన్స్‌లో ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారామె. ‘ఇందులో తిరుపతి స్లాంగ్‌ కోసం దాదాపు నెల రోజులు వర్క్‌ షాప్‌ చేశాం. పతి పదాన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నా’ అని చెప్పారు నివేద. గౌతమి కీలక పాత్ర పోషించారనీ, ఆమెతో నటించడం ఇది రెండో సారని నివేద చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదని, త్వరలోనే చెబుతానని అన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 05:36 AM