మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhaje Vaayu Vegam: ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దంటూ కార్తికేయకు ధైర్యం చెప్పిన శర్వానంద్

ABN, Publish Date - May 30 , 2024 | 08:58 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ శుక్రవారం (మే 31) వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Sharwanand and Kartikeya Gummakonda

యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటించిన సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) హీరోయిన్‌. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul Tyson) కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి (Prasanth Reddy) ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొంది ఈ శుక్రవారం (మే 31) వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్ (Sharwanand) అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘భజే వాయు వేగం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నేను గెస్ట్‌గా రాలేదు. యూవీ ఫ్యామిలీ మెంబర్‌లా వచ్చా. యూవీలో ఎవరైనా ఒక సినిమా చేస్తే వాళ్ల ఫ్యామిలీ మెంబర్‌లా మారిపోతారు. ఈ వేదిక మీదున్న చాలా మందితో నేను వర్క్ చేశాను. ‘భజే వాయు వేగం’ టీమ్‌లో ఉన్న వాళ్లతో కూడా ‘రన్ రాజా రన్’కు వర్క్ చేశాను. ఈ సినిమాకు హీరో డైరెక్టర్ ప్రశాంత్ అని చెప్పాలి. ప్రశాంత్ ఎప్పుడూ మాస్ మాస్ అనే తిరిగేవాడు. అవే కథలు రాసేవాడు. సుజీత్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ ఆలోచించేవాడు. నేను అప్పుడే అనుకున్నా ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. ప్రశాంత్, యూవీ వాళ్లు చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఇప్పుడు కార్తికేయ ఎమోషనల్‌గా చెప్పిన డౌట్స్ నాకు ఐదేళ్ల క్రితం వచ్చాయి. హీరోకు ఒక స్టేజ్‌లో మనం చేసే సినిమాలు కరెక్టేనా, మన ఛాయిస్‌లు వర్కవుట్ అవుతాయా, ఇక్కడ ఉంటామా, వెళ్లిపోదామా వంటి సందేహాలు రావడం సహజమే. అయితే మీరు నమ్మిన దారిలో, నమ్మిన కథలు చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను చెబుతున్నా, కార్తికేయ ఇక్కడే ఉంటాడు. సూపర్ స్టార్ అవుతాడు. కార్తికేయ మాస్, యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగలడు. కార్తికేయ ఆల్‌రౌండర్. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. కష్టపడి పనిచేద్దాం. గెలుపును ఎవరూ ఆపలేరు. నేను అలాగే ఇరవై ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా. ‘భజే వాయు వేగం’ మే 31న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వస్తోంది. ఎవర్నీ డిజప్పాయింట్ చేయదు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు. (Bhaje Vaayu Vegam Pre Release Event)

*Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్


హీరో కార్తికేయ (Hero Kartikeya) మాట్లాడుతూ.. మా ‘భజే వాయు వేగం’ సినిమాకు చిరంజీవిగారు, మహేశ్ బాబుగారు, ప్రభాస్‌గారు సపోర్ట్ చేశారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ ఈవెంట్‌కు శర్వానంద్ గెస్ట్‌గా వచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. యూవీ బ్యానర్‌లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సంస్థ నుంచి ఏ హీరోకు ఫోన్ వచ్చినా వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు. స్టార్స్‌తో పాటు యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న సంస్థ ఇది. ఈ సంస్థలో ఒక స్టార్‌ను ఎలా గౌరవిస్తారో, ఒక కొత్త హీరోనూ అలాగే గౌరవిస్తారు. ఆ రెస్పెక్ట్ చాలు మనం సంతోషంగా పనిచేసేందుకు. విక్కీ, వంశీ, ప్రమోద్ గారికి థ్యాంక్స్. ఎంతోమంది స్టార్ హీరోలను చూసి ఇన్స్పైర్ అయి ఇండస్ట్రీకి వచ్చాను. ఆ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఎలాంటి విలువలు నేర్పించారో, అవే విలువలు, వ్యక్తిత్వం నాలో ఉండాలనుకున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అజయ్ నాకు మంచి సక్సెస్ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు సక్సెస్ లేవని కొందరు అన్నారు. అయినా నాతో సినిమా చేసిన ప్రతి దర్శకుడినీ గౌరవిస్తా. నేను కోరుకున్న సినిమా చేయాలి, వెయిట్ చేస్తున్నా, వెళ్లాల్సిన గమ్యం సుదూరంగా ఉంది. అలాంటి టైమ్‌లో ప్రశాంత్ నేను కోరుకున్న అంశాలున్న కథతో వచ్చాడు. అదే ‘భజే వాయు వేగం’. నా వేలు పట్టి ముందుకు నడిపించాడు. ప్రశాంత్‌కు థ్యాంక్స్. ఈ సినిమాలోని టీమ్ మెంబర్స్ అంతా తమ పని వరకు చూసుకోకుండా ఇది మన సినిమా అని టీమ్ వర్క్ చేశారు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూసి రొటీన్‌గా ఉందని అనుకుంటే, కథలో ఎమోషన్స్ ఉంటేనే రొటీన్ అనుకుంటే మనం ఒక సొసైటీగా వెనక్కు వెళుతున్నట్లు. ప్రతి జెనరేషన్ ఆడియెన్‌కు ఎమోషన్స్, వ్యాల్యూస్ ఉన్న ఒక సినిమా చూపించాలి. ఈ సినిమాకు రండి.. మీ టైమ్, మనీకి వేల్యూ దక్కుతుంది.. వందశాతం గ్యారెంటీగా చెబుతున్నానని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 30 , 2024 | 08:58 PM