మరిచిపోలేని థ్రిల్‌ను పంచుతుంది

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:19 AM

వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు మీనాక్షీ చౌదరి. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ సరసన ఆమె నటించిన ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా...

వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు మీనాక్షీ చౌదరి. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ సరసన ఆమె నటించిన ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీనాక్షీ మీడియాతో పంచుకున్నారు.

‘‘ఈ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. ఆ పాత్ర నన్ను నేను రిలేట్‌ చేసుకునేలా ఉంటుంది. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌ను చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో విజయ్‌, స్నేహ, లైలా వంటి అనుభవజ్ఞులైన నటుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమా అందరికీ మరిచిపోలేని థ్రిల్‌ను పంచుతుంది. విజయ్‌ యాక్టింగ్‌, వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌ స్కిల్స్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి’’ అని చెప్పారు.

Updated Date - Sep 05 , 2024 | 03:19 AM