ముఫాసా కోసం షారుఖ్
ABN, Publish Date - Aug 13 , 2024 | 05:02 AM
ప్రపంచ వ్యాప్తంగ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ‘ముఫాసా ది లయన్ కింగ్’ ఫ్రాంఛైజ్‌లోని కొత్త సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా కోసం తొలిసారిగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్...
ప్రపంచ వ్యాప్తంగ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ‘ముఫాసా ది లయన్ కింగ్’ ఫ్రాంఛైజ్‌లోని కొత్త సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా కోసం తొలిసారిగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన ఇద్దరు కుమారులతో కలసి డబ్బింగ్ చెబుతున్నారు. సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకు షారుఖ్ గొంతు అరువిస్తుండగా, ఆర్యన్ ఖాన్ సింబా పాత్రకి, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది